తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. ఏప్రిల్ 1 నుంచి వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక వ్యక్తికి నిన్న వైద్య పరీక్షలు నిర్వహించగా..నెగెటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి స్వగృహానికి పంపించారు. కొత్తపేటలోని ఆయన స్వగృహం వద్ద పోలీసులు, వైద్య సిబ్బంది చప్పట్లు కొడుతూ ఆయనకు స్వాగతం పలికారు.
ఇదీచదవండి