ETV Bharat / state

కలెక్టర్​ కార్యాలయం సిబ్బందికి కరోనా పరీక్షలు

కరోనా కట్టడికి శ్రమిస్తున్న యంత్రాంగానికి.. కరోనా వైరస్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని పరీక్షించారు.

corona-tests-for-staff-in-the-collectors-office-at-east-godavari-district

author img

By

Published : Apr 6, 2020, 5:34 PM IST

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పని చేస్తున్న ప్రభుత్వ అధికారులకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. రెవెన్యూ , మున్సిపల్‌తో పాటు ఇతర అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. కాకినాడ ఎంపీ వంగా గీతతో పాటు నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. నిత్యం పలువురు సందర్శకులను కలుస్తున్నందున ముందస్తు చర్యగా ఈ నిర్ణయం అమలు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి తెలిపారు. కరోనా నియంత్రణకు శుభ్రత, వ్యక్తిగత దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి:

అమెరికా 'పులి'కి కరోనా- భారత్​లోని 'జూ'లలో హైఅలర్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.