ETV Bharat / state

108 సిబ్బంది మానవత్వం.. కరోనా బాధితురాలికి ప్రసవం

కరోనా మహమ్మరి విజృంభిస్తున్న తరుణంలో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. కరోనాతో బాధపడుతున్న తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామానికి చెందిన మహిళకు తమ వాహనంలోనే ప్రసవం చేసి ప్రశంసలు అందుకున్నారు.

corona positive women delivered girl child in 108 vehicle at thuni east godavari district
108 వాహనంలో ప్రసవించిన కరోనా పాజిటివ్ మహిళ
author img

By

Published : Aug 13, 2020, 10:38 PM IST

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామానికి చెందిన గర్భిణికి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. గురువారం తెల్లవారుజామున ఆమెకు ఆకస్మాత్తుగా పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

కరోనా సోకడం వల్ల ప్రసవం చేయడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు. ఫలితంగా అదే 108 వాహనంలో కాకినాడ తీసుకువెళ్తుండగా... మార్గమధ్యలోనే బాధితురాలు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. పురుడు పోసిన అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

సముద్రంలోకి వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.