తూర్పుగోదావరి జిల్లా తొండంగిలోని ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఇటీవల తిరుమల వెళ్లి వచ్చిన ఓ కుటుంబం భజన కార్యక్రమం నిర్వహించింది. వారికి జ్వరం రావడంతో అందరినీ పరీక్షించారు. అందులో 21 మందికి కొవిడ్ అని తేలింది. భజన కార్యక్రమంలో మరో నాలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని కలిసిన వారికి పరీక్షలు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో శానిటైజ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి. కొనసాగుతున్న పొరుగు సిబ్బంది నిరసనలు