లాక్ డౌన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో.. దాదాపు 400 వివాహాలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు రిజర్వేషన్లు, ఇతర ఏర్పాట్లు చేసుకున్న వారు చాలా మంది.. ఆంక్షల కారణంగా వివాహాలు వాయిదా వేసుకున్నారు.
మరి కొందరు ఆయా ముహూర్తాలకు ఇతర ప్రాంతాల్లో, వారి నివాసాల వద్ద నిరాడంబరంగా వివాహాలు చేసుకున్నారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 17 వరకు సుమారు 219 వివాహాలకు సత్య, రత్న గిరులపై వసతి గదులు, వివాహ మండపాలను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్నారు.
ఏప్రిల్ 17 నుంచి మే 13 వరకు స్వామి సన్నిధిలో మరో 200 వివాహాలు జరిగే అవకాశం ఉండేదని అధికారులు అంచనా వేశారు. కానీ.. లాక్ డౌన్ కారణంగా.. వీటిలో చాలా మంది వాయిదా వేసుకున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: