ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో నిత్యం వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నా కొందరి నిర్లక్ష్యం వైరస్‌ వ్యాప్తికి కారణంగా కన్పిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్‌ నిబంధనలు పాటించి వైరస్‌ భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ
author img

By

Published : Aug 11, 2020, 10:32 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకూ 32,938 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో యాక్టివ్‌ కేసులు 14 వేల 239 ఉన్నాయి. 18 వేల 471 మంది కోలుకున్నారు. జిల్లాలో తాజాగా 1235 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు సోమవారం బులిటెన్‌లో పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ కరోనాతో 228 మంది మరణించినట్లు రాష్ట్ర కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ వెల్లడించింది. తాజాగా నలుగురు మృతిచెందినట్లు ప్రకటించింది. తాజా కేసుల్లో 153 మందికి హోం ఐసోలేషన్‌ అవకాశం కల్పించారు. జిల్లాలో తాజాగా 1024 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కాకినాడ నడరంలో 284, రాజమహేంద్రవరంలో 278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సామర్లకోట మండలంలో 77, అమలాపురంలో 72, పామర్రులో 45, పిఠాపురంలో 47, కరపలో 46, కాకినాడ గ్రామీణంలో 40 చొప్పున కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. పెద్దాపురం మండలంలో 33, మండపేటలో 32, రాజానగరంలో 23, పెదపూడి, రౌతులపూడి మండలంలో 21, కోటనందూరు, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో 20 చొప్పున పాజిటివ్‌ కేసులు గుర్తించినట్లు వెల్లడించారు.

జిల్లాలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సోమవారం నాటికి 2009 మంది ఉన్నారు. బొమ్మూరులో 646 మంది, బోడసకుర్రులో 663, జెేన్టీయూకేలో 623, చింతూరులో 46, రంపచోడవరం వైటీసీలో 31 మంది చొప్పున ఉన్నట్లు అధికారులు తెలిపారు. బొమ్మూరు క్వారంటైన్‌ కేంద్రంలో 120 మంది, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో 298 మంది, కాకినాడ జీజీహెచ్​లో 28 మందిని ఉంచారు. దుబాయ్‌ నుంచి జిల్లాకు విమానమార్గంలో 17 మంది వచ్చారు. చెన్నై, హైద్రాబాద్‌ నుంచి 180 మంది వచ్చారు. రైళ్లు, బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలకు 740 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

ఇవీ చదవండి

కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తల ఆత్మహత్య...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.