ETV Bharat / state

గొల్లల మామిడాడలో పెరుగుతున్న కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 37 కేసులు వెలుగుచూశాయి. అప్రమత్తమైన అధికారులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

corona cases in gollala maamidaada east godavari district
గొల్లల మామిడాడలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : May 25, 2020, 7:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 20న కరోనా పాజిటివ్ లక్షణాలతో కాకినాడ జీజీహెచ్​లో మృతి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల్లో 28 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. తాజాగా మరో 9 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు.

వీటిలో.. గొల్లల మామిడాడలో 5, బిక్కవోలు మండలంలో 4 కేసులు నమోదవ్వగా.. అందులో 21 ఏళ్ల గర్భిణీ, 9 ఏళ్ల బాలిక ఉన్నారు. కేసుల ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గొల్లల మామిడాడను కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించగా.. కొన్ని ప్రాంతాలను రెడ్, బఫర్ జోన్లుగా గుర్తించారు. అనపర్తిలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే దుకాణాలు తెరవాలని ఆదేశాలిచ్చారు.

ఇవీ చదవండి:

ఏడాది పాలనపై జిల్లా అధికారులు, నేతలతో సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.