ETV Bharat / state

అంతర్వేది నూతన రథానికి ఫిబ్రవరి 13న సంప్రోక్షణ - visakha latest news

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన రథానికి సంప్రోక్షణ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ శారదా పీఠాధిపతుల చేతుల మీదుగా నిర్వహించాలని అధికారులు విశాఖ వచ్చి...స్వామిని కోరారు. ఆహ్వాన పత్రాన్ని అందించారు.

Invitation to the Dean of Shri Sharda
శ్రీ శారదా పీఠాధిపతికి అహ్వానం
author img

By

Published : Jan 31, 2021, 10:05 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన రథానికి ఫిబ్రవరి 13వ తేదీన సంప్రోక్షణ జరగనుంది. ఈ విషయాన్ని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు... విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల దృష్టికి తీసుకొచ్చారు. విశాఖకు వచ్చి సంప్రోక్షణ సందర్భంగా చేపట్టాల్సిన వైదిక కార్యక్రమాల గురించి పీఠాధిపతులకు వివరించారు. 11, 12, 13 తేదీల్లో సంప్రోక్షణ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రతువులో నూతన రథానికి కళారాధన, కలశ స్థాపన నిర్వహిస్తామని, చివరి రోజైన 13వ తేదీన సంప్రోక్షణ చేపట్టాలని ముహూర్తం నిర్ణయించామన్నారు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు తమ స్వహస్తాలతో చేపట్టాలని కోరారు. ఆహ్వాన పత్రాన్ని స్వామికి అందించారు.

నూతన రథం విషయంలో ఆగమానుసారం, శాస్త్రోక్తంగా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు, ఆలయ పండితులు, స్థానాచార్యులకు... స్వామి స్వరూపానందేంద్ర సూచించారు. అంతర్వేది నరసింహ క్షేత్రంలో ప్రత్యేకమైన వైదిక కార్యక్రమాలు చేపట్టాలని, నిత్య కళ్యాణం చేపట్టే దిశగా యోచించాలని దేవాదాయ శాఖ అధికారులకు స్వామి సలహా ఇచ్చారు.

ఇదీ చదవండి

కేంద్ర జీవన బీమా రక్ష పురస్కారానికి ఎంపికైన సాహితీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.