ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, ప్రజల ఆదాయం కొల్లగొట్టడమే పనిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
కాకినాడలో ఆ పార్టీ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోదీ, భాజపా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికే పెట్రోల్ ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు రక్షణకు ఏడువేల ఎకరాలు అమ్ముకోవాలని సీఎం జగన్ ఉచిత సలహాలు ఇస్తున్నారని శైలజానాథ్ ఆరోపించారు.
ఇదీ చదవండి: