రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా.. తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మరింత పరిశుభ్రంగా, పచ్చదనం పరిఢవిల్లేలా తీర్చిదిద్దుతామని కలెక్టర్ చెప్పారు.
ఇవీ చదవండి...కు.ని. ఆపరేషన్లలో దారుణం.. మత్తుమందు ఇచ్చి!?