తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు పందెం కోళ్లు కొట్లాడుకుంటున్నాయి. నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం ,కొత్తపేట, ఆలమూరు మండలాల్లో ఉదయం నుంచి కోడి పందేలు నిర్వహిస్తున్నారు. నిమిషాల్లోనే లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. వీటితో పాటు గుండాటలు కూడా జోరుగా నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: రావులపాలెం కోడి పందాల్లో సందడి చేసిన వి.వి.వినాయక్