భారత జలాల్లోకి అక్రమంగా చొరబడిన శ్రీలంక బోటును కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. శ్రీలంకలోని ముత్తకు చెందిన బోటు జలాల్లోకి ప్రవేశించి టూనా చేపల్ని వేటాడుతోంది. సమాచారం అందుకున్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోస్ట్ గార్డ్ విభాగం సిబ్బంది.. సముద్రంలో వెంబడించి శ్రీలంక బోటును పట్టుకున్నారు.
బోటులో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిపై ఇండియన్ ఫిషింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. శ్రీలంక బోటును కోస్ట్ గార్డ్ సిబ్బంది కాకినాడ తీరానికి తీసుకురానున్నారు.
ఇదీ చూడండి :
విమర్శలు భరించలేక.. కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నా: ముద్రగడ