తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో తెదేపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో అనేకసార్లు బొత్స.. జగన్ అవినీతి గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అదే మంత్రి ఇప్పుడు జగన్‌ను పొగుడుతున్నారని యనమల ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ... రూ. 11 కోట్లకు ఆశపడి రూ. 1400 కోట్ల వోక్స్ వ్యాగన్ ప్రాజెక్ట్ వెనక్కి పోయేలా చేశారని ఆరోపించారు. ఈడీ జప్తు చేసిన జగన్ ఆస్తులను వెనక్కి రప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై కక్షతో ప్రజావేదికను కూల్చడం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండి : ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం