TDP Mahanadu in Rajahmundry: వచ్చే ఎన్నికల్లో ధన ప్రవాహంతో గెలిచేందుకు నియోజకవర్గానికి 25 కోట్ల నుంచి 30 కోట్ల నగదును వైసీపీ నేతలు ఇప్పటికే తరలించారని తెలుగుదేశం అధినేత ఆరోపించారు. రూ.2వేల నోట్లు రద్దు కావడంతో వాటన్నిటిని 500 నోట్లలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నారని అయన మండిపడ్డారు. లక్షకోట్లు సంపాదించిన వ్యక్తికి.. 500 నోట్లు కూడా రద్దు చేస్తే పీడ విరగడవుతుందని దుయ్యబట్టారు. పేదవాడికి 150 ఇవ్వడమే అభివృద్ధా అని నిలదీశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మహానాడు ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఆయన తన తొలిసందేశం ఇచ్చారు. ప్రజాధనాన్ని దోచే వ్యక్తుల విషయంలో చండశాసనుడిలా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సహజవనరుల్ని ఇష్టానుసారంగా దోచేస్తున్న అధికారపార్టీ నేతలు.. వాటి ద్వారా వచ్చే సొమ్మును విదేశాలకు పంపడంతోపాటు బంకర్లలోనూ దాస్తున్నారని మండిపడ్డారు. 1996 సంవత్సరంలో నన్నే ప్రధానిగా ఉండమని కోరినా.. తనకు ఆ ఉద్దేశం లేదన్నారు. తన ప్రాధాన్యం తెలుగుజాతి అని.. ప్రధాని పదవి వద్దని సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. ‘ప్రధాని మోదీ సూచన మేరకు డిజిటల్ కరెన్సీపై కేంద్రానికి నివేదిక ఇచ్చాను, క్యూఆర్ కోడ్ ఇతర డిజిటల్ నగదు లావాదేవీలకు ఆ నివేదిక దోహదపడిందని వివరించారు.
పేదవాడు ధనికుడు కావడానికి చేసే యుద్ధం.. తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబును మహానాడు ఎక్వాగ్రీవంగా ఎన్నుకుంది, నేతలంతా అధినేతవద్దకు వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. జాతీయ పార్టీ అధ్యక్షునిగా చంద్రబాబుతో ఎన్నికల కమిటీ కన్వీనర్ కాల్వ శ్రీనివాస్ ప్రమాణం చేయించారు. వివేకానందరెడ్డి హత్య కేసు.. నిందితుల తరపున వాదించేందుకు పెద్ద ఎత్తున న్యాయవాదుల్ని నియమించడంతో పాటు రోజుకు 50 కోట్ల వరకు ఫీజులు ఇచ్చే పరిస్థితి ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ సొమ్మంతా ఎక్కడ నుంచి వస్తోందని నిలదీశారు. ‘రాష్ట్రంలో జరిగేది క్యాస్ట్‌వార్ కాదు క్యాష్‌వార్ అని విమర్శించారు, పేదవాడు ధనికుడు కావడానికి చేసే యుద్ధం’ అని పేర్కొన్నారు.
హత్యలు చేయించే వ్యక్తిని సీఎంగా పెట్టుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది.. ఏపీలో అడ్డు అదుపు లేని అత్యాచారాలు, హత్యలు అనే తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్ వివేకా హత్య కేసు అంశానికి సంబంధించి సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వివేకా హత్య కేసులో జగనే ప్రధాన నిందితుడని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య వెనుక జగన్ ఉన్నాడని సీబీఐ చెప్పినందున ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. హత్యలు చేసే వ్యక్తిని.. హత్యలు చేయించే వ్యక్తిని సీఎంగా పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్ ఏమవుతుందని చంద్రబాబు నిలదీశారు. సొంత పత్రిక, టీవీలను అడ్డుపెట్టుకుని ఇప్పటివరకు బుదర జల్లారు, ఇప్పుడు దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలకు జగన్ సమాధానం చెప్పలన్నారు. హత్యకు ముందు.. హత్య తరువాత నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాలు అవినాష్ రెడ్డి ప్రతి నిముషం జగన్కు వివరించాడు. హత్యకు సంబంధించి ప్రతి ఉదంతం జగన్కు తెలిసే జరిగింది అని సీబీఐ వాదన ద్వారా స్పష్టమైందని చంద్రబాబు వెల్లడించారు.
ఇవీ చదవండి: