ETV Bharat / state

Chandrababu on Adireddy సీఐడీ దర్యాప్తు ఏజెన్సీనా లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా..? చంద్రబాబు - అరెస్ట్ వార్తలు

Chandrababu on Adireddy టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించాడు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో ఫోన్​లో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. సీఐడీ అనేది దర్యాప్తు ఏజెన్సీనా లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా అని ప్రశ్నించారు.

aadhireddy
చంద్రబాబు
author img

By

Published : Apr 30, 2023, 7:20 PM IST

chandrababu on cid case: మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ఆప్పారావుతో పాటుగా ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసు ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో ఫోన్​లో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో రోజు రోజుకూ వైసీపీ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రత్యర్థులను ఓడించడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం, అక్రమ కేసులను,అరెస్టులను మాత్రమే నమ్ముకుంటుందని ఆక్షేపించారు. తాజాగా అరెస్టులే.. అందుకు సాక్ష్యమని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల్లో ఉన్న తెలుగు దేశం కార్యకర్తల నుంచి, రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరినీ కేసులతో, దాడులతో భయపెట్టి లొంగదీసుకోవాలనే దుష్ట ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలని హితవుపలికారు. సీఐడీ అనేది దర్యాప్తు ఏజెన్సీనా లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా అని ప్రశ్నించారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి: రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్, మామ అప్పారావుల అక్రమ అరెస్టును తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, కక్షసాధింపులు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని వాపోయారు. జగన్ రెడ్డి సంపాదించిన లక్ష కోట్ల అక్రమాస్తులపై యర్రన్నాయుడు కేసు వేయడంతో వారి కుటుంబంపై కక్ష కట్టాడని దుయ్యబట్టారు.

కొల్లు రవీంద్ర: జగన్ అధికార దోరహంకారానికి నిదర్శనం తన జేబు సంస్థ సిఐడి తో బీసీలపై అక్రమ కేసుల నమోదు చేస్తున్నాడని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల నేత బీసీల అభ్యున్నత కోసం అనేక పోరాటాలు చేసిన ఆదిరెడ్డి అప్పారావు అరెస్టును, ఆదిరెడ్డి వాసు పై అక్రమ కేసును ముక్తకంఠంతో ఖండిస్తున్నామని తేల్చిచెప్పారు. తక్షణమే భేషరతుగా ఆదిరెడ్డి అప్పారావు ని ఆదిరెడ్డి వాసుని విడుదల చేయకపోతే బీసీల తిరుగుబాటు ఈ ప్రభుత్వంపై తప్పదని హెచ్చరించారు.

పంచుమర్తి అనురాధ: బీసీ అనే పేరు వింటే జగన్ రెడ్డికి ఎందుకంత బీపీ అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నిలదీశారు. తాత రాజారెడ్డి నుంచి మనవడు జగన్ రెడ్డి వరకు అంతా బీసీలపై కక్ష్య సాధిస్తున్నారని ఆమె ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని పవర్ నుంచి దింపేసి బీసీల పవర్ ఏంటో చూపుతామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కొత్త తరహాలో మార్గదర్శి, ఈ రోజు ఆదిరెడ్డి వాసు తదితరులపై సూమోటో కేసులు, నోటీసు లేని అరెస్టులని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోందన్నారు.

విజయ్ కుమార్: ఏ ఖాతాదారూ ఫిర్యాదు చేయకుండా , ప్రభుత్వమే, తనకు ఇష్టంలేని వారి కంపెనీల మీద ప్రభుత్వం కేసులు పెడుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఆయా శాఖ అధికారులతో ఒక ఫిర్యాదు ఇప్పించి, సీఐడీని రంగంలోకి దించుతోందని విజయ్ ఆరోపించారు. సూమోటో కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. కేసులు బుక్ చేసి నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అనే ఒక కొత్త ట్రెండ్ కు ఈ వైసీపీ ప్రభుత్వం స్టీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ రోజు ఆదిరెడ్డి వాసు మీద పెట్టిన సెక్షన్లే మొన్న మార్గదర్శి కేసులో కేసులో కూడా పెడితే పలు కోర్టులు రిమాండ్ ఇవ్వలేదని, మళ్ళీ అదే రకమైన కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.