ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు గ్రహణం పట్టిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంలో వైఎస్ విగ్రహంపై పెడుతున్న శ్రద్ధ.. ప్రాజెక్టుపై పెట్టడం లేదని అన్నారు. కేంద్ర నిధులతో పోలవరం నిర్మాణం చేస్తే.. వైఎస్సార్ విగ్రహం పెడతారా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే డబ్బులపై పెత్తనం చేస్తూ వైఎస్సార్ విగ్రహం ఎలా పెడతారని నిలదీశారు. ఇదంతా కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? అని నిలదీశారు. కేంద్రం నిధులివ్వకుంటే.. వైఎస్సార్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఓ కారణం అవుతుందన్నారు.
గతంలో పరిహారం పొందిన పోలవరం నిర్వాసితులకూ ఎకరాకు రూ.10 లక్షల మేర పరిహరం అందచేస్తామని చెప్పిన దాని సంగతేంటని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు వెళ్తుంటే నేతలను అరెస్ట్ చేయడం తగదన్నారు.
ఇదీ చదవండి: 'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 నుంచి 30 వేలు ఇవ్వండి'