ఎస్సీ యువకుడు వరప్రసాద్‌కు తెదేపా అధినేత చంద్రబాబు రూ.2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. పోలీసుల సమక్షంలో ఆ యువకుడికి శిరోముండనం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల వైకాపా నాయకులు, అధికార పార్టీ నేతలు దుర్మార్గాలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి... వారిని అణచివేసేలా వ్యవహరించడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: 'అధ్యయనం చేసి.. ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలి'