తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో కేంద్రం బృందం పర్యటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన పంటల నష్టాలను అంచనా వేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం..ముందుగా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో చిక్కుడు పంటను పరిశీలించింది. నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొమరాజులంకలో అరటి తోటలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రామ్మోహన్...బృంద సభ్యులకు వివరించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 4335.111 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లగా...12,074 మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారని వివరించారు.
ఇదీచదవండి