ఇటీవల కురిసిన వర్షాలకు పాడైపోయిన పంటలను రహదారులను పరిశీలించేందుకు తూర్పు గోదావరి జిల్లాకు మంగళవారం కేంద్ర బృందం రానుంది. విజయవాడ నుంచి రావులపాలెం మండలం పొడగట్లపల్లి, కొమర్రాజు లంక గ్రామాల్లోని పాడైపోయిన పంటపొలాలను ఉదయం 11 గంటలకు పరిశీలించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రమైన కాకినాడకు వెళ్లే ప్రధాన రహదారిని పరిశీలించనున్నారు.
ఇదీచదవండి