దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో అత్యవసరంగా కొన్ని మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ సుశాంత్ కుమార్, ఇంజినీరు కె.లూకా, కన్సర్వేటరీ అసిస్టెంట్ కేవీవీఎస్ మూర్తి పేర్కొన్నారు. శనివారం వీరు ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. స్వామి వారి గర్భాలయానికి, లింగానికి జీర్ణోద్ధరణ పనులు చేపట్టవలసి ఉందన్నారు. అందుకోసం తాత్కాలికంగా స్వామివారి అభిషేకాలు నిర్వహించేందుకు శృంగేరి పీఠాధిపతుల నుంచి 18 అంగుళాల ఎత్తుగల బాణాకార శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించాలని ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌కు సూచించారు. మాణిక్యాంబ అమ్మవారి ఆలయంలో చలువరాతి ఫలకాలు తొలగించి మార్బుల్స్ వేసేందుకు, ఆలయంలో ఇతర మరమ్మతులు జరిపించడానికి, సప్తగోదావరి నది మెట్లు వెడల్పు చేయడానికి, స్వామివారికి జరిపే అభిషేక జలాలు పోవడానికి కాలువ ఏర్పాటుకు అనుమతి కోరుతూ తమకు నివేదిక సమర్పించాలన్నారు.
భీమేశ్వరాలయంలో మరమ్మతులు తప్పనిసరి: కేంద్ర పురావస్తుశాఖ - Review on the development works of Draksharama Bhimeshwara Temple
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో అత్యవసరంగా కొన్ని మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు తెలిపారు.