ETV Bharat / state

"ప్రయాణికులను కాపాడిన వారికి నగదు పురస్కారం" - kanna babu

గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన ఘటనలో బాధితులను కాపాడిన వారికి ప్రభుత్వం నగదు పురస్కారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున ఇస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు.

కన్నబాబు
author img

By

Published : Sep 27, 2019, 7:29 PM IST

మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో గల్లంతైన 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. బోటును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఘటనాస్థలిలో ప్రతికూల పరిస్థితుల కారణంగానే బోటు వెలికితీత ఆలస్యమవుతోందని తెలిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కాపాడిన స్థానికులకు ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారని కన్నబాబు వెల్లడించారు. మరోవైపు బోటును తీస్తామని కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు వస్తున్నారని మంత్రి వెల్లడించారు. మరో ప్రమాదం చోటు చేసుకోకూడదనే ఆచితూచి అడుగులు వేస్తున్నామన్నారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఉన్నతస్థాయి కమిటీతోపాటు మెజిస్టీరియల్ విచారణ సైతం జరుగుతోందని అన్నారు. ఆచూకీ లేని వారి కుటుంబాలకు మరణ ధ్రువపత్రం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు. బోటు ప్రయాణాలపై మాన్యువల్ రూపొందించాలని సీఎం ఆదేశించారని...బోట్లలో జీపీఎస్, నేవిగేషన్ వ్యవస్థ ఉంటేనే అనుమతి ఇచ్చే యోచన ఉందని తెలిపారు. కచ్చులూరులో మునిగిన బోటుకు ఫిట్‌నెస్ ధ్రువవత్రం ఉందని వరద ఉద్ధృతితో సుడిగుండంలో చిక్కుకోవటం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. దీనిపై చంద్రబాబు లాంటి నేతలు రాజకీయం చేయడం దురదృష్టకరమని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు.

Intro:Ap_Vsp_63_27_Narayana_Seva_Bhavan_Navarathri_Utsavalu_Ab_C8_AP10150

Body:హైందవ మతంపై ప్రజల్లో మెరుగైన అవగాహన కల్పించడంతో పాటు ప్రజల్లో దైవభక్తి పెంపొందించే ఉద్దేశంతో విజయనగరం జిల్లా కొత్తవలసలో నారాయణ సేవా భవనం ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నారాయణ సేవా భవనం సహ వ్యవస్థాపకులు వెంకట్ లక్ష్మి నారాయణ మూర్తి ఇవాళ విశాఖలో తెలిపారు ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య పోకడల నేపథ్యంలో హైందవ మత సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని దీనిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులు తెలిపారు ఇందులో భాగంగానే హిందూమతం గొప్పతనం తెలిపే విధంగా తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు అమ్మవారిని రోజుకో వేషధారణలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు
---------
బైట్ వెంకట లక్ష్మీ నారాయణ మూర్తి శ్రీ నారాయణ సేవా భవనం సహా వ్యవస్థాపకులు విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.