ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా సహా వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 50 మందిని వైద్య పరిశీలనలో ఉంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విజయనగరం జిల్లాలో ఐదుగురు, విశాఖలో 11 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 మంది, కృష్ణా, నెల్లూరు, కడప జిల్లాల్లో ఒక్కొక్కరు, అనంతపురం జిల్లాలో ఏడుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు వారి వారి ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. కుటుంబ సభ్యులు, ఇతర సందర్శకులను కూడా కలవొద్దని వారికి వైద్యారోగ్యశాఖ సూచించింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని మాత్రం ఐసోలేషన్ వార్డులో ఉంచామని.. అయితే తీవ్రమైన వ్యాధి లక్షణాలు లేవని స్పష్టం చేసింది. చైనా నుంచి వచ్చిన మరో ఐదుగురి నమూనాలను వ్యాధి నిర్ధరణ కోసం పుణెలోని జాతీయ పరిశోధనశాలకు పంపినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రతీ జిల్లాలోని బోధన, జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. 24 గంటలూ పనిచేసేలా ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.
ఇదీ చదవండి : కరోనా కాటు: చైనాలో 560కి చేరిన మృతుల సంఖ్య