తూర్పు గోదావరి జిల్లా కాకినాడ- పిఠాపురం రోడ్లో రాత్రి రాయుడుపాలెం సెంటర్లో ఒక కారు డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.
కారు పిఠాపురం నుంచి కాకినాడకు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన వాహనం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: