తల్లిపాలు బిడ్డకు దివ్యౌషధం లాంటిదని..అమ్మ ప్రేమ అమృతం అని ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కొనియాడారు. కాకినాడ గ్రామీణ బోట్ల ఎదురుగా కృషి భవన్లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. శిశువు జన్మించిన 3రోజుల పాటు ఉత్పత్తయ్యే ముర్రుపాలలో పోషకాలు, లవణాలు, విటమిన్లు, హార్మోన్లు విడుదలవుతాయని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి శిశు సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు.
తల్లిపాలలోని కమ్మదనాన్ని పిల్లలకు ఇవ్వాలని భారతదేశ గణాంకాల ప్రకారం 37 శాతం పిల్లలు మాత్రమే పుట్టిన వెంటనే తల్లి పాలను రుచి చూస్తున్నారని.. వైద్యులు శ్రద్ధ చూపి పుట్టిన గంటలోనే బిడ్డకు తల్లిపాలు అందించాలని కలెక్టర్ కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు,ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తల్లి బిడ్డ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి, ఐసీడీ, ఎస్ పీపీడీ సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రభుత్వం మాట తప్పుతోంది: కళా