తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన రామాడి రాజు, దేవిక దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు లోకేష్ రవికిరణ్ ఆదివారం మధ్యాహ్నం ఇంటి ముంగిట ఆడుకుంటున్నాడు. సమీపంలో దొరికిన చిన్న బంతిని నోట్లో పెట్టుకున్నాడు. అది ఇరుక్కుపోవడంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయాడు. కాసేపటికి గమనించిన తల్లి బాలుడి నోట్లోని బంతిని బయటకి లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇదీ చదవండి: పెళ్లి కావడం లేదని.. యువతి ఆత్మహత్య