ETV Bharat / state

విస్తరిస్తున్న బ్లాక్ ఫంగస్ ... రోజురోజుకు కేసుల్లో పెరుగుదల

రాష్ట్రంలో రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. తాజా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఇద్దరు మృతి చెందగా... మరో 5 మంది చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆరు, కర్నూలులో ఒక్క కేసు నమోదయ్యాయి.

author img

By

Published : May 22, 2021, 8:03 AM IST

black fungus
బ్లాక్ ఫంగస్

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండగా తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇద్దరు బ్లాక్ ఫంగస్ రోగులు మృతిచెందారు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె ప్రాంతానికి చెందిన రాజేంద్రబాబు, కుప్పం ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య అనే ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. మరో ఐదుగురు ఇవే లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. సి. నాగులవరం గ్రామానికి చెందిన కేవీ ప్రసాద్ అనే వ్యక్తికి ఈ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​లో ఆరుగురు బ్లాక్ ఫంగస్ రోగులు చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్ మహాలక్ష్మి తెలిపారు. విజయనగరం జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాధిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ మహేశ్ కుమార్ చెప్పారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 20 పడకలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి

బ్లాక్​ ఫంగస్​తో రుయా ఆస్పత్రిలో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.