ఇసుక అక్రమాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేస్తూ... తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం సోంపల్లి ఇసుక రీచ్ వద్ద భాజపా నాయకులు నిరసనకు దిగారు. పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని... అక్రమ రవాణా అరికట్టాలని నినాదాలు చేశారు. ఇసుక సకాలంలో అందక భవన నిర్మాణకార్మికులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర కార్యదర్శి మానేపల్లి అయ్యా జీవేమా ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి: కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా శ్రేణుల ధర్నా