తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటన నేపథ్యంలో కోనసీమ వ్యాప్తంగా భాజపా నాయకులను గృహనిర్బంధం చేశారు. రాజోలులో భాజపా మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయనతో పాటు కోనసీమ వ్యాప్తంగా అనేక మందిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇది అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే వేమ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పేగు పంచావు.. ప్రాణం పోశావు..!