జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ.. కాకినాడలో భాజపా ఏక్తా యాత్ర నిర్వహించింది. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఇతర నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భానుగుడి కూడలి నుంచి బాలాచెరువు వరకూ ర్యాలీ జరిగింది. జాతీయ పౌర జాబితాలో ఎలాంటి లోపాలు లేవని... పొరుగు దేశాల్లో వేధింపులు తట్టుకోలేక భారత్‌కు తిరిగి రావాలనుకున్న ముస్లిమేతరులకు ఈ చట్టం వరప్రదాయని అని జీవీఎల్ వివరించారు. చట్టంలో లోపాలుంటే సవరించుకునేందుకు భాజపా ముందుంటుందని చెప్పారు. రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీ, సోనియాగాంధీ ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న కారణంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సోమువీర్రాజు చెప్పారు.
ఇదీ చదవండి: అమరావతి ప్రాంత ప్రజలు అధైర్యపడొద్దు: సుజనా చౌదరి