తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో నడుచుకుంటూ వెళ్తున్న శివ అనే వ్యక్తిని గుర్తు తెలియని ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల నమోదయ్యాయి.
ఈ ఘటన తెల్లవారు జామున జరిగినా.. మృతదేహాన్ని తరలించేందుకు ఆలస్యం అయ్యింది. హత్యకోణంగా భావించి మృతదేహాన్ని తీసేందుకు పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది జాప్యం చేశారు. ప్రమాదంపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : 'జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలు తాకట్టు'