ETV Bharat / state

25 నెలల్లో అధికార మార్పిడి ఖాయం: భానుప్రకాశ్‌రెడ్డి - వైకాపా ప్రభుత్వంపై భానుప్రకాశ్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా పాలన కారణంగా.. రాష్ట్రం దివాళా తీసేలా పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 25 నెలల్లో అధికార మార్పిడి జరుగుతుందని భానుప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

bhanu prakash reddy on ysrcp government
భానుప్రకాశ్‌రెడ్డి
author img

By

Published : Sep 29, 2020, 4:21 PM IST

భానుప్రకాశ్‌రెడ్డి

రాష్ట్రంలో 25 నెలల్లో అధికార మార్పిడి జరుగుతుందని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి జోస్యం చెప్పారు. వైకాపా పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఎందుకు ఓట్లేశామా అని ప్రజలు బాధపడుతున్నారని రాజమహేంద్రవరంలో అన్నారు. ఈ 16 నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని.. నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంటే.. దివాళా తీసేలా మరిన్ని అప్పులు తెస్తున్నారని అన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో 60 నుంచి 70 శాతం ఒకే సామాజిక వర్గానిక కట్టబెట్టారని ఆరోపించారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరిపై విజయసాయి వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజమహేంద్రవరంలో మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీశ్ భానుప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో భాజపాలో చేరారు.

ఇదీ చదవండి:

శ్రీశైలానికి తగ్గిన వరద... 7 గేట్ల ద్వారా నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.