తూర్పు గోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ వెబ్‌సైట్లను నడుపుతున్నారని, వాటిని విద్యార్థులు, ప్రజలు నమ్మవద్దని ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో దూర విద్య కేంద్రాన్ని నడుపుతున్నట్లు తప్పుడు వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసి ప్రజలను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటివరకు నన్నయ విశ్వవిద్యాలయంలో ఎటువంటి దూర విద్య కోర్సులు ప్రారంభించలేదని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఫోన్ నంబరు 70930 08477 లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏకేఎన్‌యూ.ఈడీయూ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ఇదీ చదవండి: