గిరిజనుల చట్టాలు, హక్కులను పటిష్ఠంగా అమలు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనులకు ప్రయోజనం చేకూర్చే జీవో నంబర్ 3ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని పేర్కొంటూ... గిరిజన సాధన కమిటీ బంద్‌కు పిలుపు ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాల్లో గిరిజనులు బంద్ చేపట్టారు.
జీవో 3ను రద్దుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కొందరు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. జనాలు లేక రోడ్లు బోసిపోయాయి. ఫలితంగా మన్యంలో బంద్ ప్రశాంతంగా ముగిసిందని గిరిజనులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: