తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం అరటి మార్కెట్ యార్డు రాష్ట్రంలోనే అతి పెద్దది. ఈ యార్డులో ఏటా 5 లక్షల టన్నుల ఎగుమతులు జరుగుతూ, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కొనుగోలుదారులు లేక ప్రస్తుతం బోసిపోయింది. కరోనా దెబ్బకు అరటి ధర అమాంతం పతనం కావటంతో రైతు కుదేలయ్యాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఎగుమతులు నిలిచి పోవటంతో తీసుకొచ్చిన అరటి గెలలను ఏమి చేయాలో తెలియక మార్కెట్ యార్డుల్లోనే విడిచి వెళ్లిపోతున్నారు రైతులు. ఆ అరటి గెలలు కుళ్లిపోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని, లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: ఉచిత బియ్యం కోసం అర్ధరాత్రి నుంచే బారులు