తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వాధికారులు... అంగన్వాడీ ఉద్యోగులు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే అనర్ధాలను... నష్టాలను ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ వద్దు-పర్యావరణం ముద్దు అంటూ స్థానిక ప్రధాన రహదారిపై నినాదాలు చేస్తూ గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ప్రతిజ్ఞ చేసారు.
ఇదీ చూడండి: ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ అనర్ధాలపై అవగాహన