కేంద్రపాలిత పుదుచ్చేరి అసెంబ్లీకి ఈనెల 6న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నూరు శాతం ఓటింగ్ జరగాలన్న లక్ష్యంతో ఓటర్లను చైతన్యపరిచేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యానాంలో నూతన ఓటర్లకు ఈవీఎంలో ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సిబ్బంది వివరిస్తున్నారు.
గుర్తు మారితే..
బ్యాలెట్ బాక్సులో వారు ఓటు వేయాలనుకున్న అభ్యర్థి గుర్తు ప్రక్కనున్న బటన్ నొక్కిన తరువాత కంపార్ట్మెంట్లోనే ఉన్న వీవీ ప్యాడ్ మిషన్ స్క్రీన్‌లో కనిపించే చిత్రాన్ని చూడాలన్నారు. మీరు నొక్కిన గుర్తు.. కనిపించిని చిత్రం ఒకటై ఉండాలని అధికారులు విద్యార్థులకు వివరించారు. అనంతరం వాళ్లతో ఓట్లు వేయించారు. ఏదైనా సాంకేతిక లోపంతో వేసిన ఓటు వచ్చిన గుర్తు మారినట్లయితే సంబంధిత పోలింగ్ ఆఫీసర్‌కు తెలియజేయాలన్నారు.
వారం రోజులపాటు 1500 మంది విద్యార్థినీ విద్యార్థులకు... అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నూతనంగా ఓటు హక్కు పొందిన వారందరికీ ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నామని రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు.
ఇదీ చూడండి:
ఎస్ఈసీతో సీఎస్ భేటీ .. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ