ETV Bharat / state

ఆటోను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు - ravulapalem

ఈతకోట వద్ద జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఘటనలో నలుగురికి గాయాలు కాగా వారిని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఆటోను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు
author img

By

Published : Apr 20, 2019, 9:42 PM IST

ఆటోను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు వెనుక నుండి వచ్చి ఢీకొట్టిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొత్త పేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

ఆటోను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు వెనుక నుండి వచ్చి ఢీకొట్టిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొత్త పేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

Intro:Ap_cdp_48_20_jk-1_udyana_pantalu_malamala_vis_pkg_c7
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లెదుటే మాడుతున్నాయి. పంట చేతికంది అప్పులు తీరుతాయని ఆశించిన రైతులను వర్షాభావ పరిస్థితులు దెబ్బతీశాయి. వర్షాలు పడక పోవడం, తీవ్ర ఎండల నేపథ్యంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. రాజంపేట రైల్వేకోడూరు ప్రాంతాలలో ఎక్కువగా అరటి బొప్పాయి మామిడి నిమ్మ వంటి ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వేసిన పంటలకు సాగునీరు అందక నేత దశలోనే పంటలు ఎండిపోతున్నాయి. బోర్లు వేసినా నీరుపడక పంటలను బతికించుకునే పరిస్థితి లేక రైతుల చేతులెత్తేస్తున్నారు. ఎక్కడి పంటలు అక్కడే కుప్పకూలి పోతున్నాయి. లక్షలు పెట్టుబడి ఆవిరైపోతోంది చేసిన అప్పులు తడిసిమోపెడవుతున్నాయి. అప్పుల బాధతో రైతు కుదేలవుతున్నాడు.
* రాజంపేట రైల్వేకోడూరు ప్రాంతాలలో సుమారు పది వేల ఎకరాల్లో అరటి పంట, మరో పదివేల ఎకరాల్లో బొప్పాయి పంట సాగులో ఉన్నాయి. ఇందులో 50 శాతం పంటలు చేతికి వచ్చే స్థితిలో ఉండగా మరో 50 శాతం పంటలు నేత దశలో ఉన్నాయి. అరటి, బొప్పాయి పంటల సాగుకు ఎకరాకు 70 వేల రూపాయల నుంచి 80 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరాకు 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ధర ఉండి మంచి దిగుబడి వస్తే ఎకరాకు రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. కానీ ఇక్కడ పంట చేతికందక పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి ఏర్పడింది.
* వేసిన పంటలను బతికించుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. పండించిన పంటల వల్ల లాభం వస్తుందా, నష్టం వస్తుందాని ఆలోచించకుండా వేసిన పంటను కాపాడుకోవాలని తాపత్రయంతో రైతులు కొత్త బోర్లు వేస్తున్నారు. ఉన్న బోరులో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. రాజంపేట ప్రాంతంలోని మిట్టమీదపల్లె,, కొల్ల వారిపల్లి, మేకవారిపల్లి, చుండువారిపల్లి,, సింగంవారిపల్లి, వెంకటంపల్లి ప్రాంతాల్లో బోర్లలో 800 నుంచి 1100 అడుగులకు నీటి మట్టం పడిపోయింది. దీంతో పాత బోర్లు ఎండిపోయాయి. పంటను కాపాడుకునే క్రమంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కొత్త బోర్లు వేస్తారు 1100 అడుగులు వేస్తే తే ఒక ఇంచు నీరు పడుతుంది అది నెలరోజులు వచ్చి తర్వాత ఎండి పోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఒక ఇంచ్ నీరు కూడా పడకపోవడంతో వేసిన బోర్లను పూడ్చి చేస్తున్నారు. 1100 అడుగులు బోరు వేయడానికి సుమారు లక్షా 40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది
* రైతులు సాగుచేసిన అరటి పంట ఇప్పుడు ఎన్ను దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో గెలలు కూడా వచ్చాయి. నెల రోజుల్లో కోతకు వస్తుంది పెట్టిన ఖర్చులతోపాటు చేసిన అప్పులు కూడా అ తీరుతాయని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉన్నట్లుండి బోర్లలో ఒక్కసారిగా నీటిమట్టం పడిపోయింది. ఒక నెల రోజులు నీళ్ళుంటే పంట చేతికి వస్తుంది డబ్బులు కళ్ళ చూడవచ్చు అని ఆశపడ్డారు. వరుణ దేవుడు కరుణించలేదు భూగర్భ జలం ఆదుకోలేదు. ఫలితంగా గెల దశలోనే అరటి పంట మలమల మాడిపోతున్నాయ్. ఎక్కడ చెట్లు అక్కడ గెలలతో సహా నేలకు ఒరిగిపోతున్నాయ్. అర్ధ దశలోనే గెలలు కుప్పకూలి పోతున్నాయి. కళ్లెదుటే జరుగుతున్న ఈ తంతును చూసి బాధపడటం తప్ప రైతులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. కొత్త బోర్లు వేసినా ప్రయోజనం లేకపోవడంతో చేసేది లేక వేసిన పంటలు వదిలేశారు గడచిన మూడేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని రైతులు వాపోతున్నారు. రెండు మూడు రోజులకు ఒకసారి, లేదంటే కనీసం వారానికి ఒకసారి నీటి తడులను అందించడం కూడా కష్టమైపోతోంద ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Body:అడుగంటిన భూగర్భ జలాలు


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.