తూర్పు గోదావరి జిల్లా వైరామవరం మండలం చెవిటి దిబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశావర్కర్లు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని 11 రోజులుగా దీక్ష చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని యూనియన్ రాష్ట్ర నాయకురాలు వాణిశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నేతలు వారికి సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండి: