తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామపంచాయతీల్లో చాలా సంవత్సరాల నుంచి చాలీచాలని జీతాలతో కంప్యూటర్ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కొత్తపేట నియోజకవర్గంలోని ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు తమకు కల్పించాలని వారు కోరుతున్నారు.
ఇవీ చదవండి