తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా బదిలీ కావటంతో గురువారం అధికారులు ఘన సత్కారం చేశారు. జిల్లా ప్రజలు పంచిన ఆత్మీయత, అధికారులు, సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికి మరవలేని కార్తీకేయ అన్నారు. పాలనలో కటువుగా వ్యవహరించి ఉంటే మనసులో ఉంచుకోవద్దన్నారు. ప్రజావాణిలో ఆయను సత్కరించారు. సిబ్బంది కార్తీకేయకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ జిల్లా తనకు వ్యక్తిగా, అధికారిగా ఎన్నో మంచి పాఠాలను మధురానుభూతులను నేర్పిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ మల్లికార్జున హజరయ్యారు. కలెక్టరుగా నిరూపమైన సేవలు అందించరన్నారు. విపత్తుల సమయంలో ఆయన చూపిన చొరవ మరువలేమన్నారు.
ఇవీ చదవండి