లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులను ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లాలోని వృత్తి, డప్పు కళాకారులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట వివిధ ప్రదర్శనలతో వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లాలో డప్పు, గరగ, తాసాలు, నాదస్వరం, డోలు కళాకారులు 5వేల మంది వరకు ఉన్నారని.., మార్చి నెల నుంచి ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కళాకారుల ప్రతినిధులు తెలిపారు. ప్రతి కళాకారుడికి 10వేల రూపాయలతో పాటు 50కిలోల బియ్యం అందించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
ఇదీ చూడండి : చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు