ETV Bharat / state

లక్ష్యం లక్ష.. నమూనాల సేకరణపై దృష్టి - east godavari district

జిల్లాలో కరోనా మహమ్మారిపై యుద్ధం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే జిల్లాలో 17 పాజిటివ్‌ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లాలో రోజుకు 370 నమూనాలు సేకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 20 బృందాలతో నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

east godavari district
గోకవరంలో ఎస్సై చెన్నారావు నుంచి నమూనాలు
author img

By

Published : Apr 15, 2020, 5:02 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారిపై యుద్ధం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే జిల్లాలో 17 పాజిటివ్‌ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో అధికారులు అన్ని విధాలుగా అప్రమత్తమవుతున్నారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలతోపాటు భవిష్యత్తులో వైరస్‌ జాడ వెలుగుచూడకుండా ర్యాండమ్‌ పరీక్షలకూ సిద్ధమవుతోంది.

ఇప్పటికే విదేశీ, దిల్లీ పర్యటనల నుంచి జిల్లాకు వచ్చిన వ్యక్తులతో పాటు వారిని కలిసిన వారికీ పరీక్షలు పూర్తయ్యాయి. రెండో విడతగా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి పరీక్షల ప్రక్రియా పూర్తయింది. ఆరు కేసులు వెలుగుచూసిన కత్తిపూడిలో సేకరించిన నమూనాలన్నింటిలోనూ నెగిటివ్‌ ఫలితాలు రావడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. జిల్లాలో లక్ష నమూనాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు దీనిని కొనసాగించాలని భావిస్తున్నారు. కాకినాడలోని జీజీహెచ్‌, రాజమహేంద్రవరంలోని జిల్లా ఆసుపత్రితో పాటు అన్ని డివిజన్ల నుంచి నమూనాల సేకరణకు 20 ప్రత్యేక బృందాలను నియమించారు. రోజుకు 370 నమూనాలు సేకరించి అందులో 200 నమూనాలను విజయవాడకు.. మిగిలినవి కాకినాడలోని జీజీహెచ్‌కు పంపి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

జిల్లాలో కరోనా కేసులు వెలుగుచూసిన రెడ్‌, ఆరెంజ్‌ జోన్లపై అధికారులు దృష్టి సారించారు. ఆయా కంటైన్మెంట్‌ జోన్లపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చేవరకు ర్యాండమ్‌గా నమూనాల సేకరణను నిత్యం చేపట్టాలని నిర్ణయించారు. కాకినాడ నగరంలో 40, రాజమహేంద్రవరం నగరం, పిఠాపురం, పెద్దాపురం, కొత్తపేట, కత్తిపూడిల పరిధిలో 30 చొప్పున..రాజమహేంద్రవరం గ్రామీణంలో 10 వంతున నమూనాలు సేకరిస్తున్నారు. మిగిలిన నమూనాలు జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రితోపాటు అన్ని డివిజన్ల నుంచి సంచార బృందాల ద్వారా సేకరిస్తున్నారు. జిల్లాలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న 63 కేసులను వివిధ ప్రాంతాల్లోని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.

మంగళవారం నాటికి బొమ్మూరు క్వారంటైన్‌లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో 32 మంది ఉండగా.. రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో 13 మంది, అమలాపురం కిమ్స్‌లో 10 మంది, కాకినాడ జీజీహెచ్‌లో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఎవరికి అనారోగ్యంగా ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాలని.. ఆసుపత్రికి రావడం ఇబ్బందిగా ఉంటే ఇంటికే వచ్చి పరీక్షలు నిర్వహిస్తామని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మందులను దుకాణాల నుంచి తెప్పించుకున్న చిరునామాలు, కలెక్టరేట్‌లోని టెలి మెడిసిన్‌ కేంద్రానికి వస్తున్న కాల్స్‌ ఆధారంగా వారితో నేరుగా మాట్లాడి అనారోగ్య లక్షణాలు తెలుసుకుని అవసరమైన వారికి వైద్యం అందించే చర్యలూ చేపడుతున్నారు. కాకినాడలోని జీజీహెచ్‌లో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల కేంద్రంలో మూడు విడతలుగా వైద్య నిపుణులు జిల్లా నుంచి సేకరించిన నమూనాలను నిత్యం 180 వరకు పరీక్షిస్తున్నారు.

లాక్‌డౌన్‌ పొడిగింపుతో అప్రమత్తం

లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 20 తర్వాత ఆంక్షల్లో వెసులుబాటుపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉండడంతో అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ప్రజల క్షేమాన్ని కాంక్షించి ఈ గడువును తాజాగా పొడిగించారు. నిత్యావసరాలకు వెసులుబాటు ఇస్తున్న సమయంలో ప్రజలు సమూహాలుగా ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కోలుకున్న ఇద్దరు కరోనా బాధితులు

దిల్లీ వెళ్లివచ్చిన ఇద్దరు కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో జిల్లాలో కోలుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ విభాగంలో చికిత్స పొందుతున్న కాకినాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో పాటు పెద్దాపురంలో గుర్తించిన రాజమహేంద్రవరానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి కోలుకోవడంతో వీరిని మంగళవారం రాత్రి డిశ్చార్జి చేసినట్లు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. మరో రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని వారికి సూచించినట్లు చెప్పారు. ఆరోగ్యం కోలుకున్న తర్వాత రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా ఏమీ లేదని తేలడంతో వీరిని ప్రత్యేక అంబులెన్సుల్లో పంపినట్లు వివరించారు.

ఇప్పటి వరకు సేకరించిన నమూనాలు: 2,107

విడుదలైన ఫలితాలు: 1,514

వెలువడాల్సిన ఫలితాలు: 593

నమోదైన పాజిటివ్‌ కేసులు: 17

వివిధ కారణాలతో స్వీయ నిర్బంధానికి అధికారులు గుర్తించిన వారు: 17,751 మంది

స్వీయ నిర్బంధం పూర్తిచేసుకున్న వారు: 15,285 మంది

క్వారంటైన్‌, వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వారు: 63 మంది

ఇదీ చదవండి:

ఈ నెల 25 వరకు కాలువలకు సాగు నీరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.