ETV Bharat / state

కొవిడ్ సెంటర్ భవనంపై నుంచి దూకిన గిరిజనుడు మృతి

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలానికి చెందిన రమేష్ అతని భార్య ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడంతో లెనోరా విద్యాలయ ప్రాంగణంలో ఉన్న కొవిడ్ సెంటర్​లో చేరారు. ఏమైందో ఏమో గానీ బుధవారం అర్ధరాత్రి రమేష్ కొవిడ్ సెంటర్ భవనంపైకి ఎక్కి దూకేశాడు. సిబ్బంది వెంటనే అతన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమేష్ మరణించాడు.

death
death
author img

By

Published : May 14, 2021, 7:16 AM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం లెనోరా విద్యాలయ ప్రాంగణంలో ఉన్న కొవిడ్ సెంటర్ మేడపై నుంచి దూకి తీగల రమేష్ (33) అనే గిరిజనుడు మృతి చెందాడు. రంపచోడవరం మండలం సోకులగూడెం గ్రామంలో తీగల రమేష్ భార్య చిన్నయమ్మ రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో బుధవారం ర్యాపిడ్ టెస్టు చేయించుకోగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో వారు లెనోరా కొవిడ్ సెంటర్​లో చేరారు. బుధవారం అర్ధరాత్రి కొవిడ్ సెంటర్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రమేష్ . దీంతో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి బాధితుడ్ని తరలించారు. తీవ్ర గాయాలపాలైన రమేష్ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.

దీనిపై కొవిడ్ సెంటర్ ఇంచార్జి డాక్టర్ నరేశ్​ను వివరణ కోరగా.. బుధవారం రాత్రి రమేష్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడని తమ సిబ్బంది తీసుకొచ్చి గదిలో పెట్టడం జరిగిందన్నారు. అర్ధరాత్రి సమయంలో బయటకు వచ్చి మేడపై నుంచి దూకేశాడని తెలిపారు. దీంతో తమ సిబ్బంది ఏరియా ఆస్పత్రిలో అతన్ని చేర్చారన్నారు.

మతిస్థిమితం లేక పోవడం, మద్యం సేవించడం వల్ల ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటాడని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కార్తీక్ చెబుతున్నారు. అయితే అధికారులు చెబుతున్న కారణాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఇలా ఉండగా పోలీసులకు మాత్రం వైద్య సిబ్బంది కొవిడ్ మరణంగా రిపోర్టు ఇచ్చారు.

ఇదీ చదవండి:

కోలుకున్న వారిలోనూ.. కొత్త ముప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.