ETV Bharat / state

మాకొద్దు బాబోయ్ ఈ రైలు ప్రయాణం - delhi

ఏపీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం నరకప్రాయం అవుతోంది. తరచూ ఏసీలు పనిచేయక పోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఏపీ ఏసీ ఎక్స్​ప్రెస్
author img

By

Published : Jun 10, 2019, 6:55 AM IST

మాకొద్దు బాబోయ్ ఈ రైలు ప్రయాణం

దిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లే ఏపీ ఎసీ సూపర్​ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ రైలులో ఏసీలు పనిచేయటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఆదివారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 2.32 గంటలకు రాజమహేంద్రవరానికి చేరుకోగానే ప్రయాణికులంతా ఒక్కసారిగా రైలు దిగి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రైలు బయల్దేరినప్పటి నుంచి ఇదే సమస్య ఉందని.. మధ్యలో ఝాన్సీ, భోపాల్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని తాము ఎంతో ఇబ్బందులు పడ్డామని తెలిపారు. విజయవాడ నుంచి మొత్తం అన్ని బోగీల్లో ఏసీ పనిచేయటంలేదని ఫిర్యాదు చేస్తే.. తర్వాతి స్టేషన్లో మరమ్మతులు చేస్తారని అధికారులు తెలిపారన్నారు. రైలులో ఒక్క ఏసీ పనిచేయకపోవటంతో తీవ్ర ఉక్కపోతతో కూర్చోలేకపోయామన్నారు. అధికారులు, సిబ్బంది రాజమహేంద్రవరంలో మరమ్మతులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అప్పటికప్పడు 400 ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసి సాయంత్రం 5.52 గంటల సమయంలో విశాఖపట్నానికి పంపారు. టికెట్ ధరలో వ్యత్యాసాన్ని విశాఖపట్నంలో వాపసు ఇస్తామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి.

అన్నవరం సన్నిధిలో మంత్రి అవంతి శ్రీనివాస్

Imphal (Manipur) June 09 (ANI): To take stock of the growing dissent and discord within the Bharatiya Janata Party (BJP)-led coalition government and explore a possible solution BJP National General Secretary (North East in-charge) Ram Madhav held a closed-door meeting with Chief Minister N Biren. BJP Organising Secretary (North East in-charge) Ajay Jamwal was also there. They held a closed-door meeting at Hotel Classic Grande with Chief Minister N Biren, Works Minister Th Biswajit and BJP Manipur Pradesh president K Bhabananda.Since sometime back, there were rumors about growing dissent within the coalition Government led by N Biren but it became quite palpable when six Ministers stayed away from the Cabinet meeting held at Ukhrul district headquarters on June 4.Ram Madhav also attended a felicitation program where many state ministers were present.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.