తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని అదనపు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం రాత్రి అనిశా అధికారులు దాడులు జరిపారు. రాజమహేంద్రవరం ఏసీబీ సీఐ సూర్య మోహనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ముందుగా నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం రంపచోడవరంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించారు. నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసినట్లు సీఐ సూర్య మోహన్‌రావు తెలిపారు. తనకు రావలసిన ఆరు నెలల ఇంక్రిమెంట్లు, జీతాల చెల్లించాలంటే.. యూడీసీగా పనిచేస్తున్న జాకబ్, ఏడీఎంహెచ్ఓ రాజ్ కుమార్‌లు డబ్బులు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపడతామన్నారు.
ఇవీ చూడండి...