శ్రీరామనవమి.. సీతారాముల కళ్యాణం అంటే అందరికీ సందడే. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం గ్రామానికి చెందిన పేరిచర్ల సత్యవాణి ఇంటిలో మాత్రం.. శ్రీరామనవమికి నెల రోజులు ముందుగానే ఏర్పాట్లు మొదలవుతాయి. పుష్కరకాలంగా రాములోరి సేవలో పరితపిస్తున్న సత్యవేణి.. ఏటా శ్రీరామనవమి నాడు ఆమే స్వయంగా తయారు చేసిన కంతను.. వరుడు శ్రీరాముడు తరఫున వధువు సీతాదేవికి కళ్యాణ ఘట్టంలో అందజేస్తారు. ఇందుకోసం పాలకోవాతో ప్రత్యేకంగా కంత తయారుచేస్తారు. ఇరవై రోజుల ముందు నుంచే ఘుమఘుమలాడే పాలకోవాతో వివిధ ఆకృతులతో 120 రకాల పిండివంటలు సిద్ధం చేస్తారు. శ్రీ రామనవమికి పి.గన్నవరంలోని శ్రీ పట్టాభి రామాలయం వద్ద నిర్వహించే రాముల వారి కళ్యాణానికి అందజేస్తారు. కళ్యాణం అనంతరం కంతలోని పదార్థాలను ఆమె భక్తులకు పంచిపెడతారు.
ఇవీ చూడండి...