ETV Bharat / state

Annavaram: 'ప్రసాద్​ పథకం'లో అన్నవరం.. రాష్ట్రానికి కేంద్రం లేఖ

అన్నవరం దేవస్థానం, పట్టణాన్ని.. కేంద్రం 'ప్రసాద్ పథకం'లో చేర్చినట్లు మంత్రి అవంతి శ్రీనివాస్​ తెలిపారు. కేంద్ర నిధులతో అన్నవరం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

annavaram temple, city went under prashad scheme

author img

By

Published : Sep 16, 2021, 7:11 PM IST

అన్నవరం దేవస్థానం, పట్టణాన్ని.. కేంద్రం 'ప్రసాద్ పథకం'లో చేర్చింది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. గతంలో సింహాచలం దేవస్థానం కూడా 'ప్రసాద్ పథకం'లో ఎంపిక కావడంతో రూ.53 కోట్ల నిధులు వచ్చాయన్నారు. కరోనా కారణంగా ఈ పనులు కాస్త ఆలస్యం అయ్యాయన్నారు. త్వరలోనే కేంద్ర నిధులతో అన్నవరం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో అన్నవరం దేవాలయానికి ప్రాచుర్యం ఉందన్నారు.

రాష్ట్రంలో దేవాలయాల సర్క్యూట్​లను అభివృద్ధి చేసి పర్యటకులను ఆకర్షించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అవంతి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు వెళ్లిన పర్యాటక ఆస్తులను అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్​ భాగస్వామ్యం కోరుతున్నామన్నారు. మొత్తం 28 చోట్ల ఉన్న పర్యటక శాఖ ఆస్తులను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమన్నారు. ఆసక్తి ఉన్న సంస్థలు, ప్రైవేట్​ వ్యక్తులు పర్యాటక శాఖ బిడ్డింగ్​లో పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. వివిధ చోట్ల ఉన్న హరిత హోటళ్ల గదులను ఆధునికీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అవంతి తెలిపారు.

ఇదీ చదవండి:

AP Cabinet: కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం..అవి ఏంటంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.