ETV Bharat / state

వైభవోపేతం.. సత్యదేవుని కల్యాణం - satyadevuni

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. ముందుగా స్వామివారిని, అమ్మవారిని ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం కల్యాణ తంతు జరిపించారు.

వైభవోపేతంగా.. సత్యదేవుని కల్యాణ వేడుక
author img

By

Published : May 16, 2019, 7:26 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. సర్వాంగ సుందరంగా తయారుచేసిన కల్యాణ మండపంలో.. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో.. వేలాది భక్తజనం నడుమ సత్యదేవుని వివాహ మహోత్సవం కన్నులపండువగా సాగింది. ముందుగా స్వామివారిని, అమ్మవారిని ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం కల్యాణ తంతు జరిపించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు.

కలెక్టర్ కార్తికేయ మిశ్రా దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి సత్యదేవునికి పట్టువస్త్రాలు కానుకలుగా అందాయి. విద్యుత్ దీప కాంతులతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కాంతులీనింది. కల్యాణ వేదికకు దూరంగా ఉన్న భక్తులకు వివాహ దర్శన భాగ్యం కల్పించేందుకు ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో పంకాలు, కూలర్ల సౌకర్యం కల్పించారు.

యజ్ఞోపవీతం, మహా సంకల్పం, జీలకర్ర బెల్లం పెట్టించడం... మాంగల్యధారణ, తలంబ్రాలు వంటి అన్ని కార్యక్రమాలు వేద పండితులు అత్యంత శాస్త్రోక్తంగా జరిపించారు. ద్వి సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, కాకినాడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, తుని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి యనమల కృష్ణుడు కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి కల్యాణోత్సవం తిలకించి స్వామి అనుగ్రహం పొందారు.

వైభవోపేతంగా.. సత్యదేవుని కల్యాణ వేడుక

ఇవీ చదవండి..

కొత్త ప్రభుత్వానికి అందరం సహకరిస్తాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.