నేటి నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11.30 గంటల వరకు అవకాశం కల్పించనున్నారు. వ్రతాలు, నిత్య కల్యాణం, ఆర్జిత సేవలు ఈ సమయంలోనే నిర్వహిస్తారు.
అధికారులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను అనుమతించాలని కలెక్టర్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. కేటాయించిన సమయంలో భక్తులు దర్శనాలు, వ్రతాలు, కేశఖండనలు చేసుకోవచ్చని, ఆన్‌లైన్ సేవలు యథావిధిగా ఉంటాయని దేవస్థానం ఈవో త్రినాథరావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: