తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ వేడుక అత్యంత కన్నులపండువగా సాగింది. స్వామి, అమ్మవార్లను వెండి తిరుచ్చిపై ఆశీనులను చేసి ప్రాకార సేవ వేడుకగా చేశారు. లాక్డౌన్ కారణంగా మార్చి 20 నుంచి స్వామి వారి దర్శనానికి ప్రభుత్వం భక్తులను అనుమతించలేదు. దీంతో ప్రతి శనివారం ప్రధానాలయం వెలుపలే పల్లకిలో నిరాడంబరంగా సేవ నిర్వహించారు. సుమారు మూడు నెలల అనంతరం మళ్ళీ స్వామి, అమ్మవార్ల ప్రాకార సేవ ఘనంగా జరిగింది. వెండి తిరుచ్చిపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి పండితుల మంత్రోచ్ఛరణ, మేళతాళాల మధ్య ప్రధానాలయం చుట్టూ మూడు సార్లు ఊరేగించి ప్రాకార సేవ నిర్వహించారు. స్వామి వారి సేవలో భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ - ఈటీవీ భారత్ తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రాకార సేవ ఘనంగా జరిగింది. మూడు నెలల లాక్డౌన్ అనంతరం వెండి తిరుచ్చిపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి పండితుల మంత్రోచ్ఛరణ, మేళతాళాల మధ్య క్రతువును వైభవంగా నిర్వహించారు.